అతనికి పదేళ్ల జైలు శిక్ష సరైనదే

Bombay high court
Bombay high court

ముంబయి: 2011 నవంబర్‌లో పశ్చిమబెంగాల్‌కు చెందిన అరాబలి అప్రఫ్‌ ముల్లా పదిహేనేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అష్రఫ్‌ ముల్లా ఆ తర్వాత ఆ బాలికను పెళ్లి చేసుకున్నాడు. తరువాత అష్రఫ్‌ ముల్లా ఆ బాలికను డోంగ్రీ ప్రాంతంలోకి ఓ ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారకూపంలోకి దించాడు. కొన్ని రోజుల తర్వాత బాధిత బాలిక తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లి ఫిర్యాదుతో ముంబయి పోలీసులు అష్రఫ్‌ ముల్లాను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బాలికను అత్యాచారం చేయడమే కాకుండా..ఆమె జీవితాన్ని నాశనం నిందితుడు అష్రఫ్ ముల్లాకు 2015లో ట్రయల్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. నిందితుడు అష్రఫ్ ముల్లా ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ముంబై హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు అరాబలి అష్రఫ్ ముల్లాకు ట్రయల్ కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను సరైనదేనని తేల్చి చెప్పింది.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/