ఆవుల స్మగ్లర్లను కొట్టి, మూత్రం తాగించారు

Haryana Police
Haryana Police

ఫతేహాబాద్ : ఆవులను అక్రమంగా రవాణ చేస్తున్నారనే అనుమానంతో నలుగురు వ్యక్తులను కొట్టి వారితో మూత్రం తాగించిన ఉదంతం హర్యానా రాష్ట్రంలోని ఫతేహాబాద్ సమీపంలోని దేయర్ గ్రామంలో వెలుగుచూసింది. ఫతేహాబాద్ నగర సమీపంలోని దేయర్ గ్రామంలో ఆవులను అక్రమంగా రవాణ చేస్తున్నారని గ్రామస్థులు నలుగురు వ్యక్తులను బట్టలూడదీసి కొట్టారు. అనంతరం వారి చేత బలవంతంగా మూత్రం తాగించారు. ఫోన్ సమాచారంతో పోలీసులు దేయర్ గ్రామానికి వచ్చి గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. ఆవులను స్మగ్లింగ్ చేస్తున్నారని నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారితోపాటు ఆవు కళేబరంతోపాటు ఓ దూడను స్వాధీనం చేసుకున్నారు. కాగా తాము మరణించిన ఆవు కళేబరాన్ని పారవేసేందుకు తీసుకువెళుతుండగా గ్రామస్థులు తమ బట్టలూడదీసి కొట్టి, తమతో బలవంతంగా మూత్రం తాగించారని నిందితులు ఆరోపిస్తున్నారు.