నిర్ణీత సమయంలోపు నేరస్థులను ఉరి తీయాలి

mayawati
mayawati, BSP president

న్యూఢిల్లీ: బిఎస్‌పి అధినేత మాయవతి ఉన్నావ్‌ అత్యాచార బాధితురాలు మరణించడంపై తన ట్వీట్టర్ ద్వారా స్పందించారు. ఈ ఘటన తనకు బాధ కలిగించిందని ఆమె అన్నారు. నిన్న రాత్రి ఢిల్లీలో మరణించిన ఉన్నవో అత్యాచార బాధితురాలి మరణం చాలా బాధాకరమైనదని, భాదితురాలి కుంటుబానికి తర్వగా న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలలో చట్టం పట్ల భయాన్ని కలిగించాలని, కేంద్ర ప్రభుత్వం నిర్ణీత సమయంలోపు నేరస్థులను ఉరి తీయాలన్నారు. యూపితో సహా దేశవ్యాప్తంగా ఇటువంటి బాధాకరమైన సంఘటనలు మరల జరగకుండా ఉండటానికి శిక్షలను మరింత కఠినంగా అమలు చేసేలా చట్టాలను రూపొందించాలని పేర్కొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/