ఏపి అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తాం

Jagan, Narendra Modi
Jagan, Narendra Modi

న్యూఢిల్లీ: వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌ ఈరోజు ప్రధని మోడిని కలిసిన విషయం తెలిసిందే. వీరిద్దరు దాదాపు గంటా 20 నిమిషాలపాటు జరిపారు. అయితే ఈ సమావేశం తరువాత మోడి వారిద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. జగన్‌తో జరిగిన భేటీపై మోదీ తెలుగులో ట్వీట్‌ చేయడం విశేషం. ఏపి అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. ఏపి ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్‌తో అద్భుతమైన సమావేశం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిపాం. ఆయన పదవీకాలంలో కేంద్రం నుంచి సాధ్యమైనంత సహకారం అందిస్తామని హామీ ఇస్తున్నానుగగ అని మోదీ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/