జైలులో చిదంబరంతో ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌ భేటీ

Chidambaram
Chidambaram

New Delhi: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని కాంగ్రెస్‌ నాయకులు గులాం నబీ ఆజాద్‌, అహ్మద్‌ పటేల్‌ కలిశారు. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కూడా వారితో ఉన్నారు. కాశ్మీర్‌ సమస్య సహా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, త్వరలో జరుగనున్న అసెంబ్లిల ఎన్నికలు, దేశ ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.