మాజీ సీఎంల అధికారిక భవనాలు ఖాళీకి ప్రభుత్వం ఆదేశం

omar-abdullah-mehbooba-mufti
mehbooba-mufti- omar-abdullah

శ్రీనగర్‌: జమ్మూ, కాశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన తర్వాత ఆ రాష్ట్ర మాజీ సీఎంలకు చిక్కులు మొదలయ్యాయి. ఈ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు నవంబర్‌ 1తేదీ నుండి అమలు కానున్నది. ఈ నేపథ్యంలో మెహబుబా మఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాలు నివాసముంటున్న అధికారిక భవనాలను ఖాళీ చేయించాలని అధికారులు నిర్ణయించారు. జమ్యూకాశ్మీర్‌లో రాష్ట్ర శాసనసభ్యులకు పెన్షన్‌ యాక్ట్‌ ద్వారా పలు ప్రయొజానాలు అందేవి. ఇపుడు దానిని సవరించడం వల్ల ఆ ప్రయొజనాలు అందడంలేదు. జమ్మూకాశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం వలన పెన్షన్‌ యాక్ట్‌ రద్దయింది. దీంతో అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చే సౌలభ్యాలు అధికారం పోయాక ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు కాని వాహనాలు కాని వినియోగించుకొవడానికి వీలులేదు. అందుకే నవంబర్‌ ఒకటో తారిఖులోగా ప్రభుత్వ భవనాలలో నివాసముంటున్న మాజీ ముఖ్యమంత్రులిద్దరిని ఖాళీ చేయాలని కోరారు. వీరితో పాటు జమ్మూ, కాశ్మీర్‌ లోయలోని మరో ప్రభుత్వ భవనంలో నివాసముంటున్న గులాంనబీ ఆజాద్‌ను కూడా ఖాళీ చేయమని అధికారులు కోరారు.
తాజా తెలంగాణ వార్తలకోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/