ఢిల్లీ మెట్రో ప్రయాణికులకు శుభవార్త

Metro
Metro

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ నిర్మించిన గ్రే లైన్‌పై మెట్రో రైల్ పరుగులు తీయనున్నది. ఈ రైలును అక్టోబరు 4న మెట్రో భవన్ నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రారంభించనున్నారు. ద్వారక నుంచి నజఫ్‌గఢ్ మధ్య ఈ రైలు రాకపోకలు సాగించనుంది. ఫేజ్ త్రీలో గ్రే లైన్ అనేది చివరి కారిడార్. గ్రేలైన్‌ ప్రారంభంతో నజఫ్‌గఢ్‌కు చెందిన వారితో పాటు సమీపంలోని ప్రాంతాల వారికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ మార్గంలో ప్రయాణికులు గంట వ్యవధిలో నజఫ్‌గఢ్ నుంచి నోయిడాకు చేరుకునే అవకాశం కలుగుతుంది.


తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/