స్పీకర్‌కు అసమ్మతి ఎమ్మెల్యెలు లేఖ

4 వారాల గడువు కోరిన అసమ్మతి ఎమ్మెల్యేలు

Speaker -Ramesh Kuma
Speaker -Ramesh Kuma

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ అత్యంత నాటకీయ పరిణామాల మధ్యసోమవారం వాయిదా పడింది. ఈరోజు ఉదయం మళ్లీ ప్రారంభమైంది. అయితే సాయంత్రం 6గంటలకు బలపరీక్ష నిర్వహిస్తానని స్పీకర్‌ స్పష్టం చేశారు. అలాగే రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలు మంగళవారం తనని కలిసి వివరణ ఇవ్వాలని కోరారు. అయితే అందుకు తమకు మరో 4 వారాల గడువు కావాలని కోరుతూ.. స్పీకర్‌ రమేశ్‌కు ఈరోజు అసమ్మతి ఎమ్మెల్యేలు లేఖ రాశారు. సభలో సిద్ధరామయ్య ఇచ్చిన అనర్హత పిటిషన్‌ కాపీలు తమకు ఇంకా అందలేదని అందులో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం అనర్హత పిటిషన్‌ విషయంలో సదరు సభ్యులకు కనీసం ఏడు రోజుల సమయం ఇవ్వాలన్నారు. గతంలో సుప్రీంకోర్టు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేసిందని వివరించారు. కానీ, అవేమీ పరిగణనలోకి తీసుకోకుండా ప్రక్రియను వేగవంతం చేశారన్నారు. ఈ నేపథ్యంలో తమకు మరో 4 వారాల గడువు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పీకర్‌ స్పందిస్తూ ఇదంతా కోర్టు పరిధిలోని అంశమని ఈ విషయాన్ని వారు కోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/