ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఎందుకు ఆహ్వానించడం లేదు?

Sharad Pawar
Sharad Pawar

్జముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా భాజపా (105) అవతరించినప్పటికి గవర్నర్‌ భరత్‌సింగ్‌ కోశ్యారీ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం లేదో తనకు అర్థం కావడంలేదని ఎన్సీపీ అధినేత శరత్‌ పవార్‌ అన్నారు. కేంద్రమంత్రి రామ్‌దాస్‌ అఠవాలేతో భేటి తరువాత పవార్‌ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటులో నెలకొన్న సందిగ్దతపై అఠవాలే తనను సలహా కోరారని పవార్‌ మీడియాకు వివరించారు. భాజపా శివసేనకు ప్రజలు పూర్తి మెజారిటీ ఇచ్చారని, వారి తీర్పును గౌరవించి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిఉందని అఠవాలేకు చెప్పినట్లు వివరించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/