మహారాష్ట్ర రాజకీయాలపై గడ్కరీ స్పందన

ఆ మూడు పార్టీల నడుమ సైద్ధాంతిక విభేదాలున్నాయని వెల్లడి

Nithin Gadkari
Nithin Gadkari

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభానికి తెరదించేలా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సర్కారు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఉరకలు వేస్తున్న కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీల మధ్య సైద్ధాంతిక విభేదాలున్నాయని, ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేసినా అది ఎక్కువకాలం నిలవదని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా ఆయా పార్టీల నడుమ విభేదాలు కొనసాగే అవకాశముందని పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/