ముందు వరుసలో రాజ్‌నాథ్‌, అమిత్‌షా, స్మృతి ఇరానీ

Rajnath, Amith shah, Smriti irani
Rajnath, Amith shah, Smriti irani

New Delhi: లోక్‌సభలో సభ్యులకు సీట్లను కేటాయించారు. సీట్ల కేటాయింపులో మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, స్మృతి ఇరానీలకు ముందు వరుసలో సీట్లు కేటాయించారు. రాజ్‌నాథ్‌, అమిత్‌షా, నితిన్‌ గడ్కరీలు ప్రధాని మోడీ సరసన కూర్చుంటారు. మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ముందు వరుసలో న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ పక్కన కూర్చోనున్నారు. డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోకపోవడంతో ప్రతిపక్షంవైపు ముందు వరుస బెంచీలు ఖాళీగా ఉన్నాయి. తరువాత సీటులో రపతిపక్ష నేత కాంగ్రెస్‌ సభాపక్ష నాయకుడు ఆధిర్‌ రంజన్‌ చౌధురి కూర్చుంటారు. తరువాత వరుసగా యుపిఎ ఛైర్‌ పర్సన్‌ సోనియా గాంధీ, డిఎంకె నేత టిఆర్‌ బాలు కూర్చుంటారు. రాహుల్‌ గాంధీ రెండవ వరుసలో ఇప్పటి వరకూ కూర్చున్న స్థానంలోనే కూర్చోనున్నారు.