ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో జేఎన్‌యూ సెగ

దాడిని ఖండించిన విదేశీ యూనివర్సిటీల విద్యార్థులు

Oxford University
Oxford University

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థులు, ప్రొఫెసర్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి నేపథ్యంలో విద్యార్థులకు హైదరాబాద్, అలీఘడ్, కోల్ కతా, పుదుచ్చేరి యూనివర్సిటీల విద్యార్థులు సంఘీభావం ప్రకటించారు. అంతేకాదు ఆందోళనలు చేపడుతూ తమ నిరసన తెలుపుతున్నారు. అయితే, ఎక్కడో బ్రిటన్ లో ఉన్న ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో సైతం జేఎన్ యూ ప్రకంపనలు వినిపించడం ఆశ్చర్యమే. అక్కడి విద్యార్థులు సైతం ప్లకార్డులతో జేఎన్ యూ విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. కొలంబియా విశ్వవిద్యాలయంలోనూ విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టారు. వర్సిటీ క్యాంపస్ లలో ఉండే విద్యార్థులకు సరైన రక్షణ కల్పించాలని కోరారు.

తాజా ఆధ్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/devotional/