ఢిల్లీ వాసులకు సిఎం వరం

200 యూనిట్ల వరకు ఛార్జీలు లేవు 
201-400 యూనిట్లకు 50 శాతం రాయితీ 

Arvind Kejriwal
Arvind Kejriwal

న్యూఢిల్లీ: సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ వాసులకు వరం ప్రకటించారు. త్వరలో శాసనసభ ఎన్నికలున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తు వాడుకునేవారికి విద్యుత్తు బిల్లు అసలేమీ రాదని చెప్పారు. 200 యూనిట్ల వరకు పూర్తి రాయితీ, 201 నుంచి 400 యూనిట్ల వరకు వాడేవారికి 50% రాయితీ ఇవ్వనున్నట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. గురువారం నుంచే ఇది అమలులోకి వస్తుంది. విద్యుత్‌ రాయితీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి దాదాపు రూ. 18002000 కోట్ల వరకు ఖర్చుపెట్టాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. సాధారణంగా 200 యూనిట్లలోపు వాడే వినియోగదారులు 35% వరకు ఉంటే, శీతాకాలంలో వాడకం తగ్గడం వల్ల 70% వరకు ఉంటారన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/