అరుణ్ జైట్లీ కన్నుమూత

Arun-Jaitley
Arun-Jaitley

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్, మూత్రపిండాల రుగ్మతలతో బాధపడ్డ ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో బిజెపి శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిందని వైద్యులు తెలిపారు. 2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది కేంద్రంలో మళ్లీ బిజెపి విజయ ఢంకా మోగించినా, ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలోకి ఆయన చేరలేదు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/