కోచింగ్‌ సెంటర్‌లో ఫ్లెక్సీలతో పైకప్పు

fire accident
fire accident

సూరత్‌: గుజరాత్‌లోని సూరత్‌లో శుక్రవారం సాయంత్రం కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగి 22 మంది విద్యార్ధులు మృతి చెందారు. కోచింగ్‌ సెంటర్‌ యజమాని నిర్లక్ష్యం వల్లే భారీగా ప్రాణ నష్టం జరిగిందని ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. కోచింగ్‌ సెంటర్‌లో కుర్చీల స్థానంలో టైర్లను ఏర్పాటు చేశారని..దీంతో మంటలు వేగంగా వ్యాపించి ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని గుజరాత్‌ సిఎస్‌ సింగ్‌ స్పష్టం చేశారు. కోచింగ్‌ సెంటర్‌ చుట్టూ, పై భాగాన్ని ఫ్లెక్సీలతో కప్పడం భారీ ప్రాణ నష్టానికి దారి తీసిందన్నారు. దీని వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని ఆయన తెలిపారు. ఈ కేసులో కోచింగ్‌ సెంటర్‌ యజమాని భార్గవ్‌ భూటానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ భవనాన్ని నిర్మించిన ఇద్దరు బిల్డర్లు హర్షుల్‌ వెకారియా, జిగ్నేశ్‌ పలివాల్‌ పరారీలో ఉన్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/