పోలీసులకు లోంగిన ఐదుగురు ఉగ్రవాదులు

terrorist
terrorist

శ్రీనగర్‌: కశ్మీర్‌ పోలీసులు ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితులపై యువతను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయి. తాజాగా కుల్గాం జిల్లాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హింసామార్గాన్ని వదిలి పోలీసులకు లొంగిపోయారు. వేర్వేరు ఉగ్రవాద సంస్థలో చేరిన ఐదుగురు ఉగ్రవాదులు తమ తల్లిదండ్రులు, పోలీసుల మాట విని హింసను వీడి పోలీసుల ఎదుట లొంగిపోయారని అధికారులు తెలిపారు. అయితే భద్రతాకారణాల రీత్యా వారి పేర్లు, వివరాలను వెల్లడించలేదు.
ఉగ్రవాదాన్నీ వీడి స్వచ్ఛందంగా లొంగిపోతే వారికి అవసరమైన సాయం చేస్తామని, వారి జీవితాలను అండగా ఉంటామని 2017లో జమ్ముకశ్మీర్‌ పోలీసులు ప్రకటించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/