జూన్‌ 6-15 మధ్య 17వ లోక్‌సభ తొలి సమావేశాలు!

Parliament
Parliament

న్యూఢిల్లీ: వచ్చే నెలలో 17వ లోక్‌సభ తొలి సమావేశాలు జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు ఈరోజు వెల్లడించాయి. జూన్‌ 6-15 మధ్య ఈ సమావేశాలు జరిగే అవకాశమున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. అయితే 30న మోడి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ మరుసటి రోజు 31న కొత్త కేబినెట్‌ సమావేశం కానుంది. ఈ సమావేశంలో లోక్‌సభ సమావేశాల తేదీని ఖరారు చేయన్నుట్లు తెలుస్తుంది సమావేశాల తొలి రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజున ప్రొటెం స్పీకర్‌ను కూడా నియమించనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/