కరోనాతో కేరళలో తొలి మరణం

వెల్లడించిన ఎర్నాకులం జిల్లా వైద్యాధికారి.

corona death
corona death

ఎర్నాకులం: దేశంలో కరోనా విలయంతాండవం సృష్టిస్తోంది. వైరస్‌ పాజిటివ్‌ కేసులతో పాటు, మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇప్పటివరకు వైరస్‌ అధికంగా విస్తరించిన కేరళలో నిన్నటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు. కాని నేడు 69 ఏళ్ల ఒక వృద్దుడు కరోనాతో కొచ్చి మెడికల్‌ కాలేజీలో చికిత్స తీసుకుంటూ మరణించాడని ఎర్నాకుళం జిల్లా వైద్యాధికారి డా. ఎన్‌.కే.కుట్టప్పన్‌ ప్రకటించాడు. ఇప్పటి వరకు కేరళలో 176 కేసులు నమోదు కాగా 163 మందికి ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. ఇప్పటి వరకు 12 మంది దీని బారి నుండి కోలుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/