ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం

Fire breaks
Fire breaks

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఉదయం మరో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఢిల్లీలోని అనాజ్‌మండీలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది మరణించిన ఘటన మరవక ముందే మరో అగ్నిప్రమాదం ఈరోజు ఉదయం దక్షిణ ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీ ఎత్తున్న మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజిన్లతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇలా వరుస అగ్ని ప్రమాదాలతో ఢిల్లీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/