తుది విడత పోలింగ్ ప్రారంభo

Final Phase Polling
Voters atPolling Station

New Delhi: సార్వత్రిక ఎన్నికల తుది విడుత పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 59 లోక్‌సభ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలో 13 చోట్ల, పంజాబ్ 13 చోట్ల, బెంగాల్‌లో 9 చోట్ల, బిహార్‌లో 4 చోట్ల, మధ్యప్రదేశ్‌లో 4 చోట్ల, హిమాచల్‌ప్రదేశ్లో 4 చోట్ల, జార్ఖండ్‌లో 3 చోట్ల, చండీగఢ్‌లో ఒక చోట పోలింగ్ జరుగుతోంది. ఇందులోనే ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి కూడా ఉంది. ఈ ఎన్నికలు సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయి. పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన విషయం తెలిసిందే.