ప్రారంభమైన లోక్‌సభ ఐదో దశ పోలింగ్‌

polling
polling

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్‌ ప్రారంభమైంది. ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ సహా దేశంలోని ఏడు రాష్ట్రాల్లో విస్తరించిన 51 నియోజకవర్గాల నుంచి 674 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో 12% మంది మహిళలే కావడం విశేషం. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి నేటితో పోలింగ్‌ ముగియనుంది.ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీయే ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జౌళిశాఖ మంత్రి స్మృతిఇరానీ తదితర ఉద్దండులు పోటీచేస్తున్న నియోజకవర్గాలకు ఈ దశలోనే పోలింగ్‌ జరుగుతోంది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/