ఏడాదిగా కేంద్ర మాజీ మంత్రి లైంగిక వేధింపులు

sexual harrassment
sexual harrassment

ఆధారాలున్నాయంటున్న లా విద్యార్ధిని


షాజహాన్‌పూర్‌: కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద్‌ తనపై ఏడాదిగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, తనవద్ద ఆధారాలుకూడా ఉనానయని 23 ఏళ్ల న్యాయ విద్యార్ధిని మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ బిజెపి నేత తనపై ఏడాదిగా అత్యాచారానికి ప్పాడినట్లు స్పష్టం చేసింది. స్వామి చిన్మయానంద్‌ తనను మోసం చేసి భౌతికంగా తన అవసరాలను తీర్చుకున్నారని, ఈ కేసులో కేంద్ర మాజీ మంత్రి నిందితుడని చెప్పేందుకు తనవద్ద అన్ని ఆధారాలున్నాయని, సిట్‌ కమిటీకి తాను వీటన్నింటినీ సరైన సమయంలో అందచేస్తానని వెల్లడించారు.

తాను తన కుటుంబ భద్రత కోసం తన సొంత రక్షణ కోసం ఒక వీడియోను పోస్టు చేసానని వెల్లడించారు. లేనిపక్షంలో ఇన్మయానంద్‌ తనను చంపివేస్తారని ఎల్‌ఎల్‌ఎం విద్యార్ధిని వెల్లడించింది. ఆమె ముఖాన్ని నల్లని వస్త్రంతో కప్పుకుని మీడియా ముందుకు వచ్చింది. షాజహాన్‌పూర్‌ పోలీసులు ఈ రేప్‌ కేసును రిజిస్టరుచేయడంలేదని, ఆమె వలవలా ఏడ్చింది. తన ప్రాణరక్షణకోసం ఇపుడు తాను అక్కడా ఇక్కడా దాక్కోవాల్సి వస్తున్నదని షాజహాన్‌పూర్‌ జిలాయలయంత్రాంగం తమకు ఎంతమాత్రం రక్షణ కల్పించడంలేదని అన్నారు. యుపి పోలీసులపై తనకు ఎంతమాత్రం నమ్మకంలేదని, అందువల్లనే తాను న్యూఢిల్లీలోని లోధిరోడ్డుపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసానని వివరించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి https://www.vaartha.com/news/national/