ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

Navjot Singh Sidhu
Navjot Singh Sidhu

అమృత్‌సర్‌: కాంగ్రెస్‌కు అనుకున్న మేర స్థానాలు రాకపోవడానికి నన్ను బాధ్యుడి చేయడం సరికాదని ప్రముఖ మాజీ క్రికెటర్‌ ఆ రాష్ట్రమంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌పై విరుచుకుపడ్డారు. తనని పార్టీ నుంచి సాగనంపడానికి కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందన్నారు. కానీ, తనని మాత్రమే లక్ష్యం చేయడం వల్ల వచ్చే లాభమేమీ లేదని అభిప్రాయపడ్డారు. బటిండాలో గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ ఎప్పుడూ గెలవలేదు. ముఖ్యమంత్రితో పాటు ఆయన కుమారుడు కూడా ఓటమి పాలయ్యారు. ఇప్పటి వరకు అనేక సార్లు నన్ను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేశారు. కర్తార్‌పూర్‌ లాంటి అంశాల్లో నన్ను నిందితుడిగా చూపే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటి వరకు నేను ఎవ్వరి పేర్లు బయటపెట్టలేదు. కానీ పరిస్థితులు చేదాటి పోతున్నాయి అని సిద్ధూ అన్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/