హిమాచల్‌ ప్రదేశ్‌లో భవనం కూలి ఏడుగురు మృతి

Himachal Building Collapse
Himachal Building Collapse

సోలన్‌: హిమాచల్‌ ప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో కుమార్‌హట్టి ప్రాంతంలో నేలకుంగి ఓ మూడంతస్తుల భవనం ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఏడుకి చేరింది. మృతుల్లో ఆరుగురు జవాన్లు కాగా, ఒకరు సాధారణ పౌరుడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. మరో ఏడుగురు సైనికులు శిథిలాల కింద చిక్కుకొని ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఐదుగురు జవాన్లు, 12 మంది పౌరులను సహాయక సిబ్బంది రక్షించారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.. శిథిలాల్లో ఇంకా కొంతమంది చిక్కుకొని ఉండడంతో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.


తాజా జాతయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/