సిద్ధరామయ్య ప్రభుత్వ పథకాలపై విచారణ

siddaramaiah
siddaramaiah

బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హయాంలో అమలు చేసిన పథకాల కుంభకోణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి యెడియూరప్ప సిబిఐని ఆదేశించారు. దాంతో సిద్ధరామయ్యతో పాటు అప్పటి ఆయన మంత్రివర్గంలోని కాంగ్రెస్‌ నాయకులు, కాంట్రాక్టర్లు, అధికారులు చిక్కుల్లో పడ్డారు. బెంగళూరులో చేత్త సేకరించి వేరేచేసే వాహనాల కొనుగోలు కాంట్రాక్లు ముసుగులో రూ.96 కోట్లు గోల్‌మాల్‌ జరిగిందన్న ఆరోపణలున్నాయి. బాగలూరు, మిట్టగానహళ్లి క్వారీల దగ్గర లైనర్లు ఏర్పాటు చేసే కాంట్రాక్టులో రూ.109 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే విచారణ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బిజెపి నాయకుడు, బిబిఎంపి కార్పొరేటర్‌ ఎన్‌ఆర్‌.రమేష్‌ సిద్ధరామయ్య ప్రభుత్వం మీద పలు ఆరోపణలు చేశారు. కృషి భాగ్య పథకంలో రూ.9,014 కోట్లు అవినీతి జరిగిందని, చెత్త వేరు చేసే కాంట్రాక్టు విషయంలో రూ.1,066 కోట్లు గోల్‌మాల్‌ జరిగిందని, వైజ్ఞానిక చేత్త వేరు చేసే ప్లాంట్‌లు ఏర్పాటు చేసే ముసుగులో రూ.4,010 కోట్ల అవినీతి జరిగిందని ఎన్‌ఆర్‌ రమేష్‌ ఆరోపించారు. సిద్ధరామయ్య ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కృషి భాగ్యపథకానికి సంబంధించి 131 తాలూకాల్లో ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ డైరెక్టర్లను ఖచ్చితంగా విచారణ చేసి, రికార్డులు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని యెడియూరప్ప ఆదేశించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/