ఎదురుకాల్పులో ఉగ్రవాది హతం

terrorists
terrorists

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి చిత్రగామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం తెలుసుకున్నా భద్రతా బలగాలు ఈరోజు ఉదయం నిర్భంధ తనిఖీలు చేపట్టారు. అయితే పోలీసలు కదలికలు గమనించిన ఉగ్రవాదులు పరారయ్యే క్రమంలో కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు వాటిని తిప్పికొట్టాయి. ఈ కాల్పుల్లో క్షేత్రస్థాయిలో పనిచేసే (ఓడబ్ల్యూజీ) ఉగ్రవాది అక్కడికక్కడే హతమయ్యాడు. ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/