జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..

కొనసాగుతున్న కాల్పులు..

Police Force jawans
Police Force jawans

షోపియాన్‌: జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులకు, భారత సెక్యూరిటీ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే షోపియాన్ జిల్లా బోనాబజార్‌లో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర ఆర్మీ జవాన్లు గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో ఎంతమంది ఉగ్రవాదులు మరణించారనేది ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడ కాల్పులు కొనసాగుతున్నాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/