వెలువడనున్న మూడు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌

elections
elections


న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికల భేరీ మోగనుంది. మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి ఈ నెల 19వ తేదీన నోటిఫికేషన్‌ వెలువడే అవకావం ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేయలేదు. అయితే నేడు విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. రాజకీయ పార్టీలు మూడు రాష్ట్రాల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూన్నయి. ఈక ఎన్నికలు తాజాగా బిజెపి సవాల్‌గా ఉండేలా ఉన్నాయ. మరోపక్క ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. మూడు రాష్ట్రాల్లో అధికార పీఠాన్ని దక్కించుకోవడం కోసం ఎవరి వ్యూహల్లో వారు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే నేపథ్యంలో మొత్తం ఎన్నికల ప్రక్రియ డిసెంబరులోపు ముగిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొదట మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తరువాత జార్ఖండ్‌ ఎన్నికలు నిర్వహిస్తారంటున్నారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతం కాబట్టి జార్ఖండ్‌ ఎన్నికలు దశల వారీగా నిర్వహించనున్నట్లుగా భావిస్తున్నారు. నోటిఫికేషన్‌ విడుదల చేసి ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు అలర్ట్‌ అయ్యాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/