కోల్‌కతా ఉత్తర పార్లమెంటరీ స్థానానికి రీపోలింగ్‌

Election Commission
Election Commission

పశ్చిమబంగాల్‌: ఈనెల 19న కోల్‌కతా ఉత్తర పార్లమెంటరీ నియోజకవర్గం 200వ పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. అక్కడ రీపోలింగ్‌కు ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్‌ నిర్వహించాలని బంగాల్‌ ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేయాలని, ఆ కేంద్రం పరిధిలోని ఓటర్లకు సమాచారం చేరేలా ప్రచారం చేయాలని సూచించింది. అయితే సోమవారం రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, రైల్వే శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌, బిజెపి ప్రతినిధులు పశ్చిమ బెంగాల్‌లో అల్లర్లు జరిగిన కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలనిఈసీని కోరారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/