భారీ వర్షంలో శరత్‌ పవార్‌ ఎన్నికల ప్రచారం

వర్షంతో దేవుడు తమను ఆశీర్వదిస్తున్నాడని వ్యాఖ్యా

Sharad Pawar
Sharad Pawar

సతారా: కేంద్ర మాజీ మాజీ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ మాత్రం భారీ వర్షంలోనూ తడుస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. తాను కొనసాగిస్తున్న ఎన్నికల ప్రచారాన్ని ఈ వర్షం ఆపలేదనేలా వ్యవహరించారు. మహారాష్ట్రలో ఈ నెల 21న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సతారాలో శరద్ పవార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భారీ వర్షంలో తడుస్తూనే మాట్లాడుతూ… వర్షంతో దేవుడు తమను ఆశీర్వదిస్తున్నాడని వ్యాఖ్యానించారు. సతారాలో ఈ సారి ఎన్సీపీ అద్భుతం చేయనుందని గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

‘నేను గత లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఈ నియోజక వర్గంలో సరైన అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ పొరపాటును నేను అంగీకరిస్తున్నాను. అయితే, ఈ సారి నేను చాలా సంతోషంగా ఉన్నాను.. ఎందుకంటే ఆ ఎన్నికల్లో చేసిన పొరపాటును సరిదిద్దడానికి అక్టోబరు 21 కోసం సతారా ప్రజలు ఎదురుచూస్తున్నాను’ అని చెప్పారు. ఈ సారి సరైన అభ్యర్థిని నిలబెట్టానని వారికే ప్రజలు ఓటు వేస్తారని తెలిపారు. కాగా, 288 సీట్లకు జరుగుతున్న మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తుతో పోటీ చేస్తున్నాయి. వీటి ఫలితాలు అక్టోబరు 24న వెల్లడవుతాయి.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/