చిదంబరంకు ఈడీ సమన్లు జారీ

Chidambaram
Chidambaram

న్యూఢిల్లీ: ఆర్థికశాఖ మాజీ మంత్రి పి. చిదంబరంకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లు జారీ చేసింది. యూపీఏ హయాంలో ఎయిరిండియాకు నష్టం వాటిల్లేందుకు కారణమైన భారీ కుంభకోణం, నగదు అక్రమ చలామణీ కేసులో కేసులో ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో దర్యాప్తు నిమిత్తం ఆగస్టు 23న అధికారుల ఎదుట హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.
2008-09 మధ్య కాలంలో విదేశీ ప్రయివేటు విమాన సంస్థలైన ఎమిరేట్స్‌, ఎయిర్‌అరేబియా, ఖతార్‌లకు ఎయిర్‌ స్లాట్స్‌ కేటాయించడంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఈ కుంభకోణం కారణంగా దేశీయ విమానయాన సంస్థ ఎయిరిండియాకు భారీగా నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/