నేను అత్యాచారానికి పాల్పడలేదు

Shivakumar
Shivakumar

బెంగళూరు: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కర్ణాటక మాజీ మంత్రి డీకే శివకుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరుకానున్నారు. ఈడీ పంపిన సమన్లపై శివకుమార్ వేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు కొట్టివేయడంతో… నిన్న రాత్రి ఆయనకు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ఆయన విచారణకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఈ ఉదయం బెంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘నేను టెన్షన్ తీసుకోవడం లేదు. ఎవరూ టెన్షన్ పడొద్దు. నేను ఏ తప్పూ చేయలేదు. అత్యాచారం కానీ ఎవరి వద్ద నుంచైనా డబ్బు తీసుకోవడం చేయలేదు. నాకు వ్యతిరేకంగా ఏమీ లేదు’ అన్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/