శిల్పా శెట్టి భర్తకు ఈడీ నోటీసులు

ముంబయిలో విచారించనున్న అధికారులు

Shilpa Shetty's husband Raj Kundra
Shilpa Shetty’s husband Raj Kundra

ముంబయి: ప్రముఖ వ్యాపారవేత్త, నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. 2013లో హతుడైన గ్యాంగ్ స్టర్ ఇక్బాల్ మిర్చి కేసులో రాజ్ కుంద్రాపై ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజ్ కుంద్రా స్టేట్ మెంట్ ను రికార్డు చేయాల్సి వున్నందున ముంబైలోని విచారణ అధికారుల ముందు హాజరు కావాలని నోటీసులు పంపినట్టు ఓ అధికారి వెల్లడించారు. ఇదే కేసలో బాస్టియన్ హాస్పిటాలిటీ పేరిట గతంలో ఓ సంస్థను నిర్వహించిన రజనీత్ బింద్రాకు ప్రమేయం ఉందని, రజనీత్ తో కుంద్రా దగ్గరి సంబంధాలను నెరిపాడని అధికారులు అంటున్నారు. వీరిద్దరి మధ్యా జరిగిన వ్యాపార లావాదేవీలను బయటకు తీయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/