రాబర్ట్‌వాద్రాను మళ్లీ ప్రశ్నించనున్న ఇడి

robert vadra
robert vadra

robert vadra


న్యూఢిల్లీ: యూపిఎ చైర్మన్‌, కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌వాద్రాను మనీ చైన్‌ స్కామ్‌లో విచారించడానికి కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇడి ఢిల్లీ హైకోర్టును కోరింది. రాబర్ట్‌వాద్రా దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వేగంగా పావులు కదుపుతున్నది. మనీ చైన్‌ కుంభకోణం కేసులో కోర్టు బెయిల్‌ తిరస్కరించిన వెంటనే ఇడి ఢిల్లీ హైకోర్టును సంప్రదించింది. మనీ లాండరింగ్‌ కేసు విచారణలో వాద్రా సహకరించడం లేదు. ఈ కేసు చాలా ప్రశ్నలకు ఇంకా సమాధానం రాబట్టాలి. అతడిని కస్టడీలోకి తీసకుని విచారిస్తాం అని జస్టిస్‌ చంద్రశేఖర్‌ను ఇడి కోరింది. ఈ కేసులో ఇడి అభ్యర్థనపై ఢిల్లీ కోర్టు విచారణ జరుపుతున్నది. అయితే ఇడి ఆరోపణలను వాద్రా లాయర్‌ ఖండించారు. వాద్రా విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. అధికారులు కోరిన వెంటనే ఇడి ముందు హజరవుతున్నారన్నారు. ఇకముందు ఎలాంటి విచారణకైనా వాద్రా సిద్ధంగా ఉంటారన్నారు. వ్యక్తిగతంగా టార్గెట చేస్తూ కక్షసాధింపుకు పాల్పడటం సరికాదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు తిరస్కరించారు. వాటిని ఒప్పుకోలేదు. అంత మాత్రాన సహకరించడం లేదనడం సరికాదని చంద్రశేఖర్‌కు వాద్రా తరఫు న్యాయవాది వివరించారు ఈ విచారణ తిరిగి నవంబర్‌ 5కు వాయిదా వేశారు. రాబర్ట్‌వాద్రా కొనుగోలు చేసిన ఆస్థిపై ఇడి కేసు నమోదు చేసింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/