దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుంది

Priyanka Gandhi
Priyanka Gandhi

న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక మాంద్యం, ఆటోమొబైల్ పరిశ్రమ సంక్షోభంపై ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దుయ్యబట్టారు. దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతోందని, కోట్లాది భారతీయుల జీవనస్థితిపై ఖడ్గం వేళ్లాడుతోందని ఈరోజు హిందీలో చేసిన ఒక ట్వీట్‌లో ప్రియాంక పేర్కొన్నారు. ఆటో రంగంలో ఏర్పడిన సంక్షోభం ఉత్పత్తిరవాణా రంగంలో ప్రతికూల అభివృద్ధికి, మార్కెట్ అపనమ్మకానికి సూచన అని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం ఎప్పుడు కళ్లు తెరుచుకుంటుందని ఆమె ప్రశ్నించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/