రాహుల్‌గాంధీకి ఈసీ షోకాజ్‌ నోటీసులు

Rahul Gandhi
Rahul Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏప్రిల్‌ 23న మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మోడి, బిజెపి ప్రభుత్వంపై విమర్శలు  చేశారు. గిరిజనులు, ఆదివాసీల కోసం నరేంద్ర మోడి ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తోంది. గిరిజనులను కాల్చిపారేసేలా పోలీసులకు అనుమతి కల్పిస్తూ ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారు అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. దీనిపై రాహుల్‌ గాంధీకి ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అంతేకాక 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని లేదంటే తగిన చర్యలు తీసుకుంటానని నోటీసుల్లో పేర్కొంది.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/