ఇషా చాలా డిఫరెంటుగా…

Easha Ambani
Easha Ambani

బాలీవుడ్ స్టార్లతో అంబానీ ఫ్యామిలీ అనుబంధం గురించి తెలిసిందే. ఇటీవలే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ వారసుల పెళ్లి వేడుకల్లో వడ్డనలు చేయడంలో అమితాబ్-అమీర్ ఖాన్- షారూక్ అంతటివారే పోటీపడ్డారు. అలాంటిది ఆ ఫ్యామిలీ అమ్మాయి సెలబ్రిటీల ముందు ఎలా కనిపించాలి? అంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఇషా అంబానీని చూడాలి.
తాజాగా ఇషా అంబానీ ఇన్ స్టాలో ఓ ఫోటోని షేర్ చేసంది. ఆ ఫోటోలో ఇషా ప్రత్యక్షమైన తీరుకు చూపరులు కళ్లు తిప్పుకోలేదంటే అతిశయోక్తి కాదు. హాఫ్ షోల్డర్ సిల్వర్ కలర్ బ్లౌజ్.. నల్లరంగు ప్లెయిన్ శారీని ధరించింది. ఆ చీరకు బార్డర్ హెవీగా డిజైన్ చేసి ఉంది. ఇది తనకు మాత్రమే కుదిరే అభిరుచి అని యూత్ తెగ పొగిడేస్తున్నారు. చీరలో ఇషా చాలా డిఫరెంటుగా కనిపించింది. లక్షలాది మంది కళ్లు ఈ ఫోటోపైనే వాలిపోతున్నాయి.  ఇండో-వెస్ట్రన్ స్టైల్స్ లోనే కాదు.. ఏ కోణంలో చూసినా సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. తన ముఖాకృతిని కవర్ చేసేలా హెయిర్ స్ట్రెయిటెనింగ్ ఆకట్టుకుంది. ఇషాకు ఆ సింపుల్ లుక్ ఎంతో బాగా సెట్టయ్యింది. దేశవ్యాప్తంగా ఎందరో అమ్మాయిలు ఈ ఫ్యాషన్స్ ని అనుసరించాలని వేచి చూస్తారంటే అతిశయోక్తి కాదు.