అరుణాచల్‌ ప్రదేశ్‌లో భూకంపం

Richter scale graph
Earthquake

ఈటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ 42 కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్‌ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 3.0గా నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నెల క్రితం మిజోరాం, నాగాలాండ్‌, మణిపూర్‌, సిక్కిం రాష్ట్రాల్లోని పలు చోట్ల వరుసగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో తరచూ భూమి కంపిస్తుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/