గుజరాత్‌ తూర్పు భాగంలో భూకంపం

Earthquake
Earthquake

అహ్మదాబాద్‌: గుజరాత్‌ తూర్పు భాగంలో బసస్కాంతో పాటు సమీప జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిన్న రాత్రి 10.30 గంటల సమయంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. అయితే భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదు. పలన్‌పూర్ పట్టణానికి ఈశాన్యంగా 31 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు భూకంప పరిశోధన కేంద్రం వెల్లడించింది.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/