అక్కడ నదిలో చెత్త వేస్తే రూ.50,000 జరిమానా

Ganges River
Ganges River

వారణాసి: వారణాసి జిల్లా యంత్రాంగం గంగా నదిలో వ్యర్థపదార్థాలు వేసే వారిపై జరిమానా విధించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగా నదిలో వ్యర్థపదార్థాలు వేసే వారికి భారీ స్థాయిలో జరిమానాలు విధించాలనే నిర్ణయానికి వచ్చింది. నదిలో ఎవరైన పదే పదే చెత్త వేస్తే వారికి రూ.50,000 జరిమానా విధించాలని జిల్లా అధికారి సురేంద్రసింగ్‌ స్పష్టం చేశారు. అయితే ఒక వ్యక్తి మొదటిసారి నదిలో వ్యర్థ పదార్థాలు వేస్తే అతడికి రూ.2000, అదే తప్పును రెండోసారి చేస్తే రూ. 10,000, మూడోసారి కూడా అదే విధంగా ప్రవర్తిస్తే అతనికి రూ. 50,000 జరిమానా విధించాలని అధికారులకు సురేంద్రసింగ్ సూచించారు. కాలువలలో చెత్త వేసే వారిపై కూడా అదే విధంగా కఠినంగా వ్యవహరించాలని దిశా నిర్దేశం చేశారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/