డ్రోన్ల సాయంతో మారుమూల‌కు ర‌క్త న‌మూనాలు

drone
drone

టిహరీ(ఉత్తరాఖండ్‌): డ్రోన్ల వాడకం గత నాలుగైదేళ్లలో అనేక రంగాలకు వ్యాపించింది. తాజాగా వైద్య రంగంలోనూ వీటి సేవల్ని వినియోగించుకోవాలన్న లక్ష్యంతో చేసిన ప్రయోగం విజయవంతమైంది. ఇప్పటికే ప్రథమ చికిత్స కోసం చేసిన ప్రయోగాలు కొంత మేర విజయవంతమైనా.. పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. దేశంలోని అనేక మారుమూల ప్రాంతాల్లో రవాణా సదుపాయం సరిగా లేకపోవడంతో సరైన సమయంలో వైద్యం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. అలాగే గిరిజన ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలినపుడు.. వారికి వైద్య పరీక్షలు చేయడం ప్రహసనంగా మారింది. ఈ నేపథ్యంలో డ్రోన్లు ఎంతగానో ఉపకరిస్తాయని భావించి ఈ దిశగా దాదాపు నాలుగేళ్ల కిందట ప్రయోగాలు ప్రారంభించారు.

తాజాగా ఉత్తరాఖండ్‌ టిహరీ జిల్లాలోని రవాణా వసతులు లేని ఓ మారుమూల గ్రామంలోని ప్రాథమిక చికిత్సాలయంలో రక్త నమూనాలు సేకరించారు. దాన్ని డ్రోన్‌ సాయంతో 30కి.మీ దూరంలో ఉన్న నగరానికి చేర్చారు. ఇందుకుగానూ కేవలం 18 నిమిషాల సమయం మాత్రమే తీసుకోవడం గమనార్హం.