ప్రతిభ ఉంటే రెట్టింపు జీతాలు!

టిజిఎస్‌ ట్యాలెంట్‌ టెస్ట్‌తో ఎంపికలు

salary
salary

ముంబయి: ఐటిసేవల దిగ్గజం టిసిఎస్‌ ఇకపై ప్రతిభ ఉన్న ఉద్యోగులకు రెట్టింపు జీతాలు ఇచ్చేందుకు నిర్ణయించింది. అయితే కంపెనీ ఇందుకోసం నిర్ణయించిన కఠినమైన పరీక్షలు ఉత్తీర్ణులు కావాలిస ఉంటుంది. ఐటి దిగ్గజం మరింతగా నిపుణులను ఆకర్షిఇంచేందుకు ఈ చర్యకు ఉపక్రమించింది. కంపెనీ గత ఏడాదే టిసిఎస్‌ నేషనల్‌ క్వాలిపయర్‌ టెస్ట్‌ను ప్రవేశపెట్టింది సుమారు 2.2 లక్షలమంది పరీక్షకు వచ్చారు. టిసిఎస్‌ ప్రతి క్యాంపస్‌కు వెళ్లి నియామకాలుచేసుకోనవసరం లేకుండా ఇక నేరుగా ఈ ప్రతిభా పరీక్షనుంచే నియామకాలు చేపడుతోంది కంపెనీ ఇప్పటివరకూ 30వేల మంది అభ్యర్ధులకు కాల్‌లెటర్‌స పంపించిందని సిఇఒఒ సుబ్రహ్మణియమ్‌ వెల్లడించారు. పరీక్షలో ఉత్తఈర్ణులు అయితే వారిని హాట్‌ ట్యాలెంట్‌గా పిలుస్తామని అంతేకాకుండా వారికి రెట్టింపు జీతం ఇస్తామని గ్లోబల్‌ హెచ్‌ఆర్‌ ఉపాధ్యక్షుడు మిలింద్‌ లక్కడ్‌ వెల్లడించారు. వీటితోపాటు ఇపుడున్న అంతర్గ ఉద్యోగులకుసైతం ఈ పరీక్ష నిర్వహిస్తామన్నారు. మూడేళ్ల సర్వీసు ఉన్న వారికి ఈపరీక్షలు నిర్వహిస్తామని, అదేవిధంగా డిజిటల్‌పరీక్షలు పెడతామని లక్కడ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఐటిరంగం రికవరీ దిశగా మరింత వేగంగా కదులుతోందని, రెండేళ్లుగా తాము వ్యూహాత్మకంగా ప్రతిభావంతులనియామకాలు చపడుతుననట్లు వెల్లడించారు. వీరిలో అత్యున్నత ప్రతిభను చూపించిన వారికి మరింతగా రెట్టింపు జీతం ఇస్తామని సిఒఒ సుబ్రహ్మణియమ్‌ వెల్లడించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/telangana/