మీ విమానం మాకేమీ వద్దు: రాహుల్‌

Rahul Gandhi
Rahul Gandhi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, చూడాలని భావిస్తే, రాహుల్ గాంధీ కోసం ఓ విమానం పంపుతానని రాష్ట్ర గవర్నర్ మాలిక్ చేసిన ట్వీట్ పై రాహుల్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ…

”డియర్ గవర్నర్ మాలిక్. నాతో కూడిన విపక్ష నేతల బృందం, మీ ఆహ్వానం మేరకు జమ్మూ అండ్ కశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో పర్యటనకు వస్తోంది. మీ విమానం మాకేమీ వద్దు. అయితే, మేము స్వేచ్ఛగా తిరిగి, ప్రజలను కలుసుకుని, వారితో మాట్లాడే విషయంలో సహకరించండి. రాష్ట్ర నేతలను, సైనికులను కలుసుకునే ప్రయత్నాన్ని అడ్డుకోకండి”అని వ్యాఖ్యానించారు.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/