కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వొద్దంటున్న ఏపి

Kaleshwaram Project
Kaleshwaram Project

ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించొద్దంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఏపిలోని రైతులకు పూర్తిగా విరుద్ధమని ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ కేసులో తెలంగాణను పార్టీగా పరిగణించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. తెలంగాణలోని ముంపు ప్రాంతాలను ఏపిలో కలిపేయడంతో తెలంగాణ అభ్యంతరాలను తెలిపే హక్కును కోల్పోయిందని పేర్కొంది. అందువల్ల పోలవరం విషయంలో అభ్యంతరం చెప్పే హక్కు తెలంగాణకు లేదని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని హామీలు, అఫిడవిట్‌లోని అంశాలను పరిశీలించి సత్వరమే అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. విభజన హామీల అమలులో జాప్యం జరుతున్నదని తెలంగాణ బిజెపి నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అందుకు ప్రతిగా తెలంగాణ ప్రభుత్వం కూడా అఫిడవిట్‌ దాఖలు చేసింది. కాగా ఇప్పుడు ఏపి ప్రభుత్వం కూడా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/