వాహనాలపై కులం, ప్రాంతం, సంస్థల పేరు ఉండకూడదు

జైపూర్ పోలీసుల ఆదేశాలు

Jaipur police
Jaipur police

జైపూర్‌: ట్రాఫిక్ ఉల్లంఘనలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన రాజస్థాన్ లోని జైపూర్ పోలీసులు మరో ముందడుగు వేశారు. వాహనదారుల వాహనాలపై కులం పేరు కానీ, ఊరి పేరు కానీ కనిపించడానికి వీల్లేదని ఆదేశించారు. కులం, ప్రాతం, సంస్థలు, హోదాలను వాహనాలపై పేర్కొనడం సమాజంలో సమానత్వాన్ని దెబ్బతీస్తుందని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. కులతత్వం వాహనాలపై కనిపించడం సామరస్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పారు. ఇదే విషయంపై పౌర సమాజం కూడా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో, పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, రాజస్థాన్ పోలీసులు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని నడిపిన వారికి రూ. 1000 చలానా విధించి… అదే సొమ్ముతో ఒక బ్రాండెడ్ హెల్మెట్ ను వారికి అందిస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/