సెక్స్‌ రాకెట్‌ కేసులో స్టాలిన్‌ అల్లుడిపై కేసు

MK Stalin's son-in-law Sabareesan

MK Stalin’s son-in-law Sabareesan 

చెన్నై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పొల్లాచ్చి సెక్స్‌రాకెట్‌ కేసు విషయంలో లేనిపోని ఆరోపణలు చేస్తురంటూ డిఎంకె చీఫ్‌ స్టాలిన్‌ అల్లుడిపై కేసు నమోదైంది. పాఠశాలలు, కళాశాలల అమ్మాయిలే లక్ష్యంగా ఈ సెక్స్‌ రాకెట్‌ ముఠా చెలరేగిపోయింది. ఫేస్‌బుక్‌ స్నేహం పేరుతో అమ్మాయిలతో కొంతకాలం సఖ్యంగా ఉండి అపై శారీరకంగా దగ్గరయ్యేవారు. దీన్నంతా విడియోతీసి బాక్ల్‌్‌ మెయిల్‌కు పాల్పడ్డారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరపడంతో ఈ వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా ఉచ్చులో దాదాపు 200 మందికిపైగా యువతులు చిక్కినట్టు విచారణలో తేలింది. ఈకేసుపై సిపిఐ దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ కేసులో అన్నాడీఎంకే పొల్లాచ్చి శాఖ యువ నాయకుడు నాగరాజన్‌ ప్రధాన నిందితుడిగా తేలడంతో పార్టీ అతడిని వెంటనే అరెస్టు చేసింది. కాగా ఈ కేసు విషయంలో డిఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ అల్లుడు శబరీశన్‌ తన కుమారుడి పేరును ప్రస్తావిస్తూ లేనిపోని అరోపణలు చేస్తున్నారంటూ చెన్నై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు తమిళనాడు డిప్వూటీ స్పీకర్‌ వి.విజయారామన్‌ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శబరీశన్‌పై కేసు నమోదు చేశారు.