శివకూమార్‌కు 13 వరకూ కస్టడీ

కీలక సాక్షాలున్నాయన్న ఇడి

dk-sivakumar
dk-sivakumar

న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ కేసులో డికె శివకుమార్‌కు ఈ నెల 13వ తేదీ వరకూ ఇడి కస్టడీ విధించారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్‌కుమార్ కుహర్ బుధవారం ఆదేశాలు వెలువరించారు. ఆయనను 14 రోజుల కస్టడీకి అప్పగించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కోరింది. అయితే ఈ వాదనను పరిశీలించిన తరువాత ప్రత్యేక న్యాయస్థానం శివకుమార్‌ను తొమ్మిదిరోజులు కస్టడీకి పంపించేందుకు అనుమతిని ఇచ్చింది. ఈ ఆదేశాల వెంటనే పోలీసులు ఆయనను కస్డడీలోకి తీసుకున్నారు. కర్నాటకలో సీనియర్ కాంగ్రెస్ నేత అయిన శివకుమార్‌ను మంగళవారం ఇడి అరెస్టు చేసింది.

ఆయనను బుధవారం ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అంతకు ముందు ఆయనకు ఇక్కడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు, పలు సాక్షాల ప్రాతిపదికన చూస్తే తాము అరెస్టు చూస్తే శివకుమార్‌కు వ్యతిరేకంగా కీలక విషయాలు లభ్యం అయ్యాయని, పైగా ఆయన విచారణకు సహకరించకపోవడం, కీలక పదవులు నిర్వర్తించిన ఆయన ఆదాయంలో గణనీయ పెరుగుదల కన్పించడం వంటి అంశాలు దృష్టికి వచ్చాయని, కస్టడీకి అప్పగిస్తేనే నిజాలు మరింతగా వెలుగులోకి వస్తాయని న్యాయమూర్తికి ఇడి విన్నవించుకుంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/