నిర్మలా సీతారామన్‌కు ప్రముఖుల ప్రశంసలు

Nirmala Sitharaman
Nirmala Sitharaman

న్యూఢిల్లీ: నిర్మలా సీతారామన్‌ దేశ ఆర్థికశాఖ మంత్రిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెను ప్రశంసించారు. ఇందిరాగాంధీ తర్వాత ఆ బాధ్యతలు స్వీకరించిన మహిళ సీతారామన్‌ కావడం విశేషం. అందులో భాగంగా కాంగ్రెస్‌ నాయకురాలు దివ్య స్పందన సీతారామన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆమె ముందున్న సవాళ్లను గుర్తు చేసే ప్రయత్నం చేశారు.1970లో ఇందిరా గాంధీ తర్వాత సీతారామన్‌ ఓ కీలక శాఖకు బాధ్యతలు స్వీకరించడం మహిళా లోకానికి గర్వకారణం. కానీ స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) గణాంకాలు మాత్రం అంతగా బాగోలేనట్లు కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి మీ వంతు కృషి చేస్తారని విశ్వసిస్తున్నాను. మా నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అభినందలు అని దివ్య ట్వీట్ చేశారు.

అలాగే జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సైతం సీతారామన్‌ను అభినందించారు. ఆర్థిక మంత్రిగా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకొని హద్దుల్ని చెరిపేశారుగ అని వ్యాఖ్యానించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/