16 ఏళ్ళ బాలికపై సామూహిక అత్యాచారం

Gang rape of minor girl
Gang rape of minor girl

భువనేశ్వర్‌: 16 ఏళ్ల ఓ బాలిక తనపై గ్యాంగ్‌ రేప్‌ చేశారని పోలీసు స్టేషన్‌ ఫిర్యాదు చేసిన ఘటన కుంభరపాదాలో చోటు చేసుకుంది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసుల కథనం ప్రకారం.. భువనేశ్వర్‌లో ఉంటుందని అయితే ఆ బాలిక తన స్వగ్రామానికి వెళ్లడానికి నిమపారా బస్టాండ్‌లో బస్సుకోసం వేచి ఉంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన జితేందర్‌ సేథీ అనే వ్యక్తి మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి బాలిక దగ్గరికి వచ్చి తాను మాజీ కానిస్టేబుల్‌నని, మేమంతా నీకు సహాయం చేస్తామని నమ్మబలికారు. తన గ్రామానికి వెళ్లే బస్సు వెళ్లిపోయిందని ఆ బాలిక చెప్పడంతో వెంటనే వాళ్లు బలవంతంగా కారులో ఎక్కించి పూరీ ప్రాంతంలో ఝడేశ్వరీ పోలీస్‌ క్వార్టర్స్‌కు బాలికను తీసుకెళ్లి ఓ గదిలో బంధించారు. అందులో ఇద్దరు తనను అత్యాచారం చేసినట్లుగా, వారు మద్యం సేవించి పడుకోవడం గమనించి కిటికీలోంచి అటుగా వెళ్లున్న వ్యక్తి సాయంతో బయట పడింది. అనంతరం కానిస్టేబుల్‌ ఐడి కార్డు, అతని వాలెట్‌లను చూపి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుక్ను పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/