లడాక్ లోని లేహ్ లోజెండాను ఆవిష్కరించనున్న ధోనీ!

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా..

MS Dhoni to start guard duty in Kashmir
MS Dhoni to start guard duty in Kashmir

న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయ తెలిసిందే.ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ లడాక్ లోని లేహ్ లో స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. భారత సైన్యంలోని ప్యారాచూట్ విభాగంలో ధోనీ గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను ధోని కలిగి ఉన్నాడు. తన బృందంతో కలసి రేపు లేహ్ కు ధోనీ వెళ్లనున్నారని ఓ సైనికాధికారి తెలిపారు.

ఈ సందర్భంగా సదరు సైనికాధికారి మాట్లాడుతూ, భారత సైన్యానికి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ అని తెలిపారు. ప్రస్తుతం అతను విధులను నిర్వహిస్తున్న చోట తన బృంద సభ్యులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని చెప్పారు. సైనిక బలగాలతో కలసి విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఆగస్టు 15 వరకు ధోనీ తన విధుల్లో ఉంటారని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/